దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్బంగా 408 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. గత ఏడాది 242 ప్రత్యేక రైళ్లను నడిపింది. గత ఏడాదితో పోల్చితే.. ఈ ఏడాది అదనంగా మరో 166 రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ తెలిపారు. ప్రత్యేక రైళ్లలో 26 సువిధ రైళ్లు, 56 జనసాధారణ్ రైళ్లు కూడా ఉన్నాయన్నారు. ఈ ప్రత్యేక రైళ్లకు అదనంగా ప్రతిరోజూ 20 నుంచి 25 అదనపు కోచ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సంక్రాంతి పండక్కి 408 ప్రత్యేక రైళ్లు - 408 Special Trains for Sankranti
సంక్రాంతి పండుగ సందర్భంగా ద.మ రైల్వే 408 ప్రత్యేక రైళ్లను నడపనుంది. గత ఏడాదితో పోలిస్తే... అదనంగా 166రైళ్లను నడపనున్నట్లు రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, నర్సాపూర్, కాకినాడ, విజయవాడ, కర్నూల్ సిటీ, శ్రీకాకుళం రోడ్, కరీంనగర్, కోయంబత్తూర్, చెన్నయ్, విల్లుపురం, అంత్రాగచ్చి, గచ్చువెల్లి, కాన్పూర్, విశాఖపట్టణం, భువనేశ్వర్, గౌహతి, రక్సోల్, మచిలీపట్నం రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని రైళ్లను పెంచుతామన్నారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకుని ఇబ్బందులు పడేకంటే...ఆన్ లైన్ లో తీసుకోవాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ