హైదరాబాద్ పాతబస్తీలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. విశాఖపట్నం నుంచి నాందేడ్‌కు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి షాలిబండ వద్ద పట్టుకున్నారు. 400కిలోల గంజాయి, రెండు కార్లు, ఐదు చరవాణిలు సీజ్ చేశారు. పాతబస్తీకి చెందిన ఐదుగురు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పాతబస్తీలో 400కిలోల గంజాయి సీజ్ - ganja seized at Old City in hyderabad
కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి నాందేడ్‌కు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని పాతబస్తీలో స్వాధీనం చేసుకున్నారు.
![పాతబస్తీలో 400కిలోల గంజాయి సీజ్ 400 kg ganja seized in Old City hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5511585-thumbnail-3x2-ganj-rk.jpg)
పాతబస్తీలో 400కిలోల గంజాయి సీజ్