తెలంగాణ

telangana

ETV Bharat / state

వీల్యాబ్​ పేజీ.. 40 లక్షల మంది వీక్షకులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్​లైన్​ విద్య, ప్రయోగాలకు డిమాండ్​ పెరుగుతోంది. కొవిడ్​-19 కారణంగా కంపెనీలకు వెళ్లి ప్రయోగాలు, ఇంటర్న్​షిప్​లు చేసే వీలు లేకపోవడం వల్ల ఆన్​లైన్​లో ప్రయోగాలకు ఇంజినీరింగ్​ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో వర్చువల్‌ ల్యాబ్‌ ద్వారా ప్రయోగాలు చేసేందుకు ఉత్సుకత చూపారు. ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా హైదరాబాద్​ ఐఐఐటీ వర్చువల్​ ల్యాబ్​ వెబ్​ పేజీని వీక్షించారు.

40 lakh viewers saw hyderabad iiit virtual lab web page
వీల్యాబ్​ పేజీ.. 40 లక్షల మంది వీక్షకులు

By

Published : Jun 30, 2020, 10:02 AM IST

కొవిడ్‌-19 ప్రబలిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్య, ప్రయోగాలకు పెద్దపీట దక్కుతోంది. అనూహ్యంగా హైదరాబాద్​ ట్రిపుల్‌ ఐటీలోని వర్చువల్‌ ల్యాబ్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ పేజీని చూసిన విద్యార్థులు, ఇతర సాంకేతిక నిపుణుల సంఖ్య ఆకాశాన్నంటింది. మార్చి 25 నాటికి వర్చువల్‌ ల్యాబ్‌ వెబ్‌ పేజీ వీక్షకుల సంఖ్య 6,28,300 ఉండగా.. సోమవారం(జూన్‌ 29)నాటికి 40లక్షలకు చేరుకుంది.

ప్రస్తుతం భౌతికంగా కళాశాలలు, కంపెనీలకు వెళ్లి ప్రయోగాలు/ ఇంటర్న్‌షిప్‌లు చేసే అవకాశం లేకపోవడం వల్ల ఆన్‌లైన్‌లో ప్రయోగాలకు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో వర్చువల్‌ ల్యాబ్‌ ద్వారా ప్రయోగాలు చేసేందుకు ఉత్సుకత చూపారు. కేవలం భారతీయ విద్యార్థులే కాకుండా అమెరికా, యూఏఈ, ఫిలిప్పైన్స్‌, మలేషియాకు చెందిన వారు 15శాతం వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

ఇన్‌ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ సాంకేతికత(ఐసీటీ)లో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహకారంతో ట్రిపుల్‌ ఐటీలో 2012లో వర్చువల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అదనపు వనరులు, వీడియో ఉపన్యాసాలు, యానిమేషన్‌ ఆధారిత ప్రదర్శనలు, యూజీ, పీజీ, పరిశోధక విద్యార్థులకు స్వీయ మూల్యాంకనం అందుబాటులో ఉంటుంది.

దేశంలోని ఆరు ఐఐటీలతోపాటు ట్రిపుల్‌ఐటీ, అమృత విశ్వవిద్యా పీఠం, పుణె ఇంజినీరింగ్‌ కళాశాల, దయాల్‌బాగ్‌ ఇనిస్టిట్యూట్‌, ఎన్‌ఐటీ సూరత్‌కల్‌ సహకారంతో నిర్వహిస్తున్నారు. దాదాపు 1000కి పైగా ప్రయోగాలు ఆన్‌లైన్‌లో చేసేందుకు వీలు కల్పించారు. వర్చువల్‌ ల్యాబ్‌ నిర్వహణ, ప్రయోగాలను అప్‌డేట్‌ చేయడం ట్రిపుల్‌ఐటీ చూస్తోంది.

గత 6 నెలలుగా డిమాండ్‌

-వెంకటేశ్‌ చొప్పెళ్ల, వర్చువల్‌ ల్యాబ్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌

సైన్స్‌, ఇంజినీరింగ్‌ సంబంధిత ఆన్‌లైన్‌ ల్యాబ్‌ సామగ్రి విషయంలో గత 6 నెలల్లో డిమాండ్‌ బాగా పెరిగింది. వర్చువల్‌ ల్యాబ్‌పై ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు వీలుగా అవకాశం కల్పించాం. ట్రిపుల్‌ఐటీ నిర్వహిస్తున్న రెండు ఆన్‌లైన్‌ ల్యాబ్‌లు ప్రపంచంలోనే టాప్‌-10 స్థానాలో నిలిచాయి. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ డాటా స్ట్రక్చర్‌ ల్యాబ్‌, వీ ల్యాబ్‌ కలుపుకొంటే 2.25 లక్షల మంది చూశారు.

ఇవీ చూడండి: ఆన్​లైన్​లోనే పౌర సేవలట... కరోనా వేళ అవసరమట!

ABOUT THE AUTHOR

...view details