40 BC castes to be merged in central OBC list: తెలంగాణకు చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో కలపాలని జాతీయ వెనకబడిన కులాల కమిషన్కు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ను రాష్ట్ర సభ్యులు శుభప్రద పటేల్, కిషోర్ గౌడ్ కలిశారు. ఓబీసీ జాబితాలో లేక పోవటం వల్ల ఆయా సామాజిక వర్గాలకు చెందిన చాలా బీద కులాల కుటుంబాలకు చెందిన బిడ్డలు కేంద్రంలో విద్యా, ఉద్యోగపరంగా రిజర్వేషన్ల ఫలాలు కోల్పోతున్నారని వివరించారు.
సమస్య ఏమిటి?: కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలుగా గుర్తించిన కులాలను కూడా ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంలో ముందడుగు పడటం లేదని వాపోయారు. రాష్ట్రంలో బీసీ కులాలుగా గుర్తింపు ఉన్న అన్నింటిని పరిశీలించి వాటన్నింటిని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు వర్గీకరిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.