ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా భారీ సంఖ్యలో చిన్నారులకు విముక్తి కల్పించినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకార్మికులు, వీధి బాలలు, తప్పిపోయిన చిన్నారులు, అనాథలు, చెత్త సేకరించే పిల్లలు, యాచిస్తున్న చిన్నారులను సంరక్షించినట్లు ఆమె పేర్కొన్నారు. వీరిలో 3వేల 613 మంది బాలురు, 484 మంది బాలికలున్నారు. ఇందులో 1,648 చిన్నారులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించామని.... 2వేల 266 మంది చిన్నారులను స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆశ్రమాల్లో ఉంచినట్లు తెలిపారు. పట్టుబడిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు 1,192 మంది ఉన్నారు. దర్పన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముగ్గురు చిన్నారులను గుర్తించి వాళ్ల తల్లిదండ్రులకు అప్పజెప్పినట్లు వెల్లడించారు. పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై 478 కేసులు నమోదు చేశామని స్వాతి లక్రా చెప్పారు. గాజుల పరిశ్రమ, ఇటుక బట్టీలు, మెటల్ పరిశ్రమల్లో పనిచేసేందుకు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి దళారులు చిన్నారులను తీసుకొచ్చినట్లు గుర్తించి వారి బారి నుంచి పిల్లలను కాపాడినట్లు స్వాతి లక్రా పేర్కొన్నారు.
ఆపరేషన్ ముస్కాన్లో 4వేల97 మంది చిన్నారులకు విముక్తి - ఆపరేషన్ ముస్కాన్
జులై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 4వేల 97 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. వారిలో 1,648 మందిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఆపరేషన్ ముస్కాన్లో 4వేల97 మంది చిన్నారులకు విముక్తి