ఏపీలోని విశాఖ మన్యం జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ జాగేరులో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలతో 4 నెలల చిన్నారిని చంపుకుంది ఓ తల్లి. చిన్నారికి దోషం ఉందని పాలిస్తే తల్లికి మరణ గండం ఉందంటూ ఓ భూత వైద్యుడు చెప్పిన మాటలను ఆమె నమ్మింది. ఏడు రోజుల పాటు పసిపాపకు పాలు ఇవ్వడం మానేసింది. గుక్క పెట్టి ఏడుస్తున్నా ఆమె మనసు కరగలేదు. చిన్నారి ఏడుపు విన్న సమీప బంధువు... చిన్నారి తల్లిదండ్రులను మందలించాడు. భార్య దగ్గరికి తీసుకెళ్లి పాలు పట్టిస్తుండగా శిశువు మృతి చెందింది.
భూత వైద్యుడు చెప్పాడని.. పాపకు పాలివ్వకుండా చంపేసింది! - విశాఖ జిల్లా నేర వార్తలు
ఏ తల్లి అయినా... తాను పస్తులుండైనా బిడ్డల కడుపు నింపాలనుకుటుంది. ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళ మాత్రం తల్లి ప్రేమకు మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. మూఢ నమ్మకాలతో 4 నెలల పాపకు పాలివ్వకుండా వారంపాటు ఏడిపించింది. చివరికి ఆ చిన్నారి ప్రాణం విడిచింది.
పాలు పట్టక.. పాడె కట్టారు