హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో కరోనాతో నలుగురు మృతి చెందారు. మేడిపల్లి, చిలకలగూడ, ముషీరాబాద్, హయత్‌నగర్‌కు చెందిన బాధితులు అనారోగ్యంతో కింగ్‌కోఠిలోని ఆసుపత్రిలో చేరారు. వీరికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
కోఠి ఆసుపత్రిలో కరోనాతో నలుగురు మృతి
రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌తో ఈరోజు నలుగురు బాధితులు మృతి చెందారు. అబిడ్స్ పరిధిలో ఇవాళ 22 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కోఠి ఆసుపత్రిలో కరోనాతో నలుగురు మృతి
వీళ్లందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా... ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు మృతి చెందారు. అలాగే అబిడ్స్ పరిధిలో ఇవాళ 22 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు ఈ సర్కిల్లో 1371 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.