తెలంగాణ

telangana

ETV Bharat / state

3PM TOPNEWS: టాప్​న్యూస్@3PM - టాప్​న్యూస్@3PM

ఇప్పటివరకున్న టాప్​న్యూస్

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : May 3, 2022, 2:58 PM IST

  • నైట్​క్లబ్​లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్​..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేపాల్​లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించి రాహుల్ ఓ నైట్​క్లబ్​లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై భాజపా నేతలు విమర్శలకు దిగగా.. కాంగ్రెస్ వారికి దీటుగా బదులిచ్చింది.

  • సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్- పాక్ సైనికులు

రంజాన్​ పర్వదినాన భారత్​-పాక్ సరిహద్దులో మత సామరస్యం వెల్లివిరిసింది. పంజాబ్​లోని అట్టారీ వాఘా సరిహద్దులో ఇరు దేశాల ​సైనికులు స్వీట్లు పంచుకున్నారు.

  • బాబా ఆశ్రమానికి వెళ్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి

భక్తులతో వెళ్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టడం వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో మంగళవారం ఉదయం జరిగింది.

  • అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని... అందినకాడికి దోచేశాడు

అమెరికాలో ఉద్యోగం అనగానే తన పెళ్లి కోసం దాచుకున్న రూ.10 లక్షలను సైబర్‌ కేటుగాళ్లకు ముట్టజెప్పారు ఓ బాధితురాలు. సికింద్రాబాద్‌ లాలాగూడకు చెందిన యువతి అమెరికాలో ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్నారు.

  • తెలంగాణలో రంజాన్ సంబురం..

ముస్లింల అతిపెద్ద పండుగల్లో ఒకటైన రంజాన్‌ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా సాగుతున్నాయి. ముస్లిం సోదరులు ఈద్గాలకు వెళ్లి... భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

  • భాజపావాదం... ఆదివాసీ నినాదం: ఎంపీ సోయం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురుడు పోసుకున్న ఆదివాసీ హక్కుల పోరాట ఉద్యమాన్ని దిల్లీ స్థాయిలో వినిపించడంలో తుడుందెబ్బ రాష్ట్ర సమితి పాత్ర కీలకమైనది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎంపీ సోయం బాపురావు అనూహ్యంగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

  • కారు బ్రేక్ ఫెయిల్.. నటికి తీవ్ర గాయాలు..

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రమాదానికి గురయ్యారు. ఓ ఆలయానికి వెళ్తుండగా దురదృష్టవశాత్తు ఈఘటన జరిగింది. కాలికి గాయాలైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు తనుశ్రీ.

  • 12 ఏళ్లకే 50కేజీల బస్తా ఎత్తి.. ఇప్పుడు పసిడిని ముద్దాడి..

ఐడబ్ల్యూఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్‌ హర్షద స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది.

  • ఓపెనింగ్‌లో చెన్నై రికార్డు..

ఐపీఎల్ ప్రస్తుత సీజన్​లో తీవ్రంగా విఫలమైన చెన్నై ఓపెనర్లు సన్​రైజర్స్​తో మ్యాచ్​లో మాత్రం రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. మరి మిగతా జట్ల ఓపెనర్లు ఎలా ఉన్నారు. ఆ టీమ్​ల పరిస్థితి ఏంటి?

  • పరాగ్​కు ఉద్వాసన తప్పదా?

ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్ సంస్థలోని​ పలువురికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ట్లిట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్​ లీగల్‌ హెడ్‌ విజయ్​ గద్దెను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details