ఇప్పటివరకున్న ప్రధాన వార్తలుఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదు: కేంద్రం ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా సేకరణ సాధ్యపడదని స్పష్టం చేసింది. ధాన్యం సేకరణకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయని తెలిపింది.ఆర్టీసీ బస్సు బోల్తా: మహిళ మృతి.. 34 మందికి గాయాలుఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా, 34 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.కేంద్రం తీరుపట్ల తెరాస ఎంపీలు ఫైర్ గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశంలో కేంద్ర వైఖరిని తెరాస ఎంపీలు తప్పుపట్టారు. తెలంగాణ ప్రతిపాదనలు పంపలేదనటంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన తెరాస ఎంపీలు.. కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడును భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.కారులో చెలరేగిన మంటలు..హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు.ఇద్దరికే 23 గోల్డ్ మెడల్స్ బాల్యం నుంచే కష్టాలు ఎదురైనా చదువులో విశేషంగా రాణించారు కర్ణాటకు చెందిన ఇద్దరు విద్యార్థులు. ఒకరు ఎంఏలో 14 గోల్డ్ మెడల్స్ సాధించగా.. మరొకరు బీఏలో 9 బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. వీళ్ల కన్నీటి గాథ తెలిస్తే ఎవరైనా అభినందిస్తారు.ముళ్ల కప్పను ఎప్పుడైనా చూశారా.?విశ్వంలో ఎన్నో వింతలు.. విచిత్రాలు జరుగుతుంటాయి. నిత్యం ఏదో ఒకచోట మనకు తెలియని విషయం బయటపడుతుంటుంది. సముద్ర గర్భంలో ఎన్నో విచిత్రమైన జీవులున్నాయి. అవి ఎప్పుడో ఓసారి మన ముందుకు వస్తుంటాయి. అలా తాజాగా ఓ ముళ్ల కప్ప వచ్చింది.మళ్లీ పడిపోయిన మిథాలీ ప్రపంచకప్లో ఆకట్టుకుంటున్న స్మృతి మంధాన, యస్తికా భాటియా.. వన్డే ర్యాంకింగ్స్లో జోరు కనబర్చారు. భాటియా 8 స్థానాలు ఎగబాకగా.. మంధాన ఓ స్థానం మెరుగుపడింది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో డకౌట్ అయిన కెప్టెన్.. ప్రస్తుతం ఎనిమిదో స్థానానికి పడిపోయింది.హీరో మోటార్ కార్ప్ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులుహీరో మోటార్ కార్ప్ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. ఆ సంస్థ ఛైర్మన్, సీఈవో సహా ఇతర అధికారుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.మొటిమలున్న స్త్రీలకు ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయా? యుక్తవయసు వచ్చినప్పటి నుంచి శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. స్త్రీలు ఆకర్షణీయంగా మారుతారు. క్రమంగా శృంగార వాంఛలు దరిచేరుతాయి. ఆ వయసులోనే ముఖంపై మొటిమలు కూడా పుట్టుకొస్తాయి. మరి మొటిమలు ఎక్కువగా ఉన్నవారిలో శృంగార వాంఛలు ఎక్కువగా ఉంటాయా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..నటనలో మేటి.. వివాదాలతో దోస్తీ!నటనతో పాటు వివాదాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కంగనా రనౌత్. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా కంగన గురించి తెలిపే చిత్రమాలిక మీకోసం...