తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యపై అనుమానంతో... కూతురిని ఇసుకలో పాతిపెట్టాడు - baby murder in kadapa district

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ చిన్నారి పాలిట యముడయ్యాడు. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదతీరాల్సిన బుజ్జాయి ఇసుక తిన్నెల్లో శవమై తేలింది. భార్యపై అనుమానంతో మూడు నెలల పాపాయిని... ఓ తండ్రి కిరాతకంగా ఇసుకలో పూడ్చి పెట్టిన దారుణ ఘటన కడప జిల్లా వేంపల్లిలో జరిగింది.

3months-baby-murdered-by-her-father-in-kadapa-district-vempalli
భార్యపై అనుమానంతో... కూతురిని ఇసుకలో పాతిపెట్టాడు

By

Published : Jan 5, 2020, 6:37 PM IST

భార్యపై అనుమానంతో... కూతురిని ఇసుకలో పాతిపెట్టాడు

ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా వేంపల్లెలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తన మూడు నెలల చిన్నారిని హత్య చేసి... గుట్టు చప్పుడు కాకుండా పాపాఘ్ని నదిలో పూడ్చి పెట్టాడు. రెండు రోజుల క్రితం కూతురిని ఇంటివద్ద నుంచి ఎత్తుకెళ్లిన గజేంద్ర... చిన్నారిని ఇంటికి తీసుకురాలేదు. అనుమానంతో తల్లి ఖుషిదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయగా... తనే హత్య చేసినట్లు గజేంద్ర అంగీకరించాడు. వేంపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్​ సుభాష్ చంద్రబోస్​లు కలిసి.. తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details