తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 389 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,55,732కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
ts corona: రాష్ట్రంలో కొత్తగా 389 కరోనా కేసులు, ఒకరు మృతి - రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మారుతోంది. ఒకరోజు తగ్గినట్లే కనిపిస్తున్నా... మరుసటి రోజుకు వచ్చేసరికి నమోదులో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా మరో 389 కేసులు నమోదయ్యాయి.
covid
24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,862కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 420 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,45,594కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,276 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:Vaccination: స్పెషల్ డ్రైవ్లో మొదటి రోజు 26,892 మందికి వాక్సిన్