కరోనా విపత్కర సమయంలో మహిళా పోలీసులు చేస్తున్న కృషిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు. కొవిడ్ బారిన పడి కోలుకుని విధుల్లో చేరిన 38 మంది మహిళా పోలీసులను బషీర్‌బాగ్‌లో ఆయన సత్కరించారు. భారతదేశ సంస్కృతిలో మహిళలకు ఉన్నత స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు.
పోలీసుల కృషి వల్లే హైదరాబాద్ నగరం శాంతిభద్రతల విషయంలో త్వరలోనే దేశంలో మొదటి స్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది కుటుంబం ఎంత ముఖ్యమో విధులు కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.