తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర పోలీస్‌శాఖలో 38 శాతం ఉద్యోగుల కొరత - 38 per cent staff shortage in the Telangana State Police Department

పోలీస్‌శాఖ పరంగా దాదాపు అన్ని పనులకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సింది కానిస్టేబుళ్లే. అలాంటి కీలకమైన కానిస్టేబుళ్లు రాష్ట్రంలో చాలినంత మంది లేరు. పోలీస్‌ విభాగంలో ఉన్న ఖాళీల్లో కానిస్టేబుళ్ల ఖాళీలే 81 శాతం ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉన్నవారిలోనూ పలువురిని ప్రముఖుల భద్రతకు పంపించాల్సి వస్తుండటంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది.

రాష్ట్ర పోలీస్‌శాఖలో 38 శాతం ఉద్యోగుల కొరత
రాష్ట్ర పోలీస్‌శాఖలో 38 శాతం ఉద్యోగుల కొరత

By

Published : Jan 28, 2021, 7:47 AM IST

దేశవ్యాప్తంగా 2020 జనవరి నాటి లెక్కల ప్రకారం సివిల్‌, రిజర్వ్‌ పోలీస్‌ విభాగాల పరంగా 5.31లక్షల ఖాళీలున్నట్లు పోలీసు పరిశోధన అభివృద్ధి మండలి(బీపీఆర్‌డీ) పరిశీలన తేల్చింది. ఆయా రాష్ట్రాల పోలీస్‌ శాఖలతో పోల్చి చూస్తే సంఖ్యాపరంగా తెలంగాణ రాష్ట్రం ఖాళీల్లో అయిదో స్థానంలో ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ తెలంగాణ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. ఖాళీల శాతంలో మాత్రం తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది.

  • రాష్ట్రంలో 55,983 మంది కానిస్టేబుళ్ల పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 32,128 మందే పనిచేస్తున్నారు. 23,810 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ లెక్కన పోలీసు విభాగంలో ఉన్న మొత్తం 29,492 ఖాళీల్లో కానిస్టేబుళ్ల ఖాళీలు 80.73 శాతంగా ఉంది. ఆ తర్వాత అత్యధికంగా హెడ్‌కానిస్టేబుళ్ల ఖాళీలు(4,286) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,405 మంది హెడ్‌కానిస్టేబుళ్లకుగాను 8,119 మంది మాత్రమే ఉన్నారు.
  • దేశవ్యాప్త ఖాళీల సగటు 14,372 కాగా.. తెలంగాణలో దాదాపు రెండున్నర రెట్లు అధికం.
  • మరికొద్ది రోజుల్లో దాదాపు 20వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయి కొత్త పోలీసులు గనక విధుల్లోకి వస్తే దాదాపు 90శాతం పోస్టులు భర్తీ అవుతాయి.

ABOUT THE AUTHOR

...view details