రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర విచారణ కోసం ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో రెండు చొప్పున.. మిగతా జిల్లాల్లో ఒకటి చొప్పున ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసింది.
ఏడాది పాటు
నేటి నుంచి ఏడాది పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తాయని జీవోలో పేర్కొంది. అదనపు జిల్లా సెషన్స్ కోర్టు హోదాలో పనిచేస్తాయని తెలిపింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను సత్వర విచారణ జరిపి.. తీర్పులు ఇచ్చేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జులై 25న ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు
సుప్రీంకోర్టు తీర్పు మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ సెప్టెంబరు 5న హైకోర్టులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈనెల 2, 5 తేదీల్లో హైకోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వానికి లేఖలు రాశారు.
ఇవీచూడండి: హైదరాబాద్లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్