తెలంగాణ

telangana

ETV Bharat / state

'కుల్సుంపురా పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్​' - Hyderabad Goshamahal Cordon Search

హైదరాబాద్​ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్గిల్ నగర్ ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో 36 ధ్రువీకరణ లేని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ACP_Narender Reddy
ACP_Narender Reddy

By

Published : Feb 12, 2020, 11:51 PM IST

హైదరాబాద్ గోషామహల్ కుల్సుంపురా పోలీస్​ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు, 6 మంది సీఐలు, 24 మంది ఎస్​ఐలు ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్ మొత్తం 169 మంది ఇందులో పాల్గొన్నారు.

సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు మొత్తం 176 ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. బెల్ట్ షాప్ నడిపిస్తున్న కృష్ణ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 58 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

కుల్సుంపురా పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్

ఇదీ చూడండి:ఫోన్ చేసి ఆమ్లెట్​ కావాలన్నాడు... వెళ్తే కోరిక తీర్చమని వేధించాడు

ABOUT THE AUTHOR

...view details