కళ్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ పథకం అమలు కోసం 350 కోట్ల రూపాయలను బీసీ సంక్షేమ శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. కళ్యాణలక్ష్మి పథకం కోసం తాజా బడ్జెట్లో 700 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో సగం 350 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కళ్యాణలక్ష్మికి మోక్షం... రూ. 350 కోట్ల నిధులు మంజూరు - కళ్యాణలక్ష్మికి 350 కోట్ల రూపాయల మంజూరు
కళ్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాం కోసం రూ.1,00,116 లను విడుదల చేస్తారు. ఈ పథకం పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఎంతో తోడ్పాటునందిస్తుంది.
కళ్యాణలక్ష్మికి 350 కోట్ల నిధులు మంజూరు
TAGGED:
Kalyanalaxmi Funds released