ఆర్థిక సంవత్సరం పన్నుల రాబడు(Tax revenue for the current financial year)ల్లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఐదు నెలల్లో రూ.1,06,900 కోట్ల అంచనాకు గాను.. ఆగస్టు వరకు పన్నుల ద్వారా రాష్ట్రానికి 37,591 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ మేరకు వివరాల(Tax revenue for the current financial year)ను రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు అందించింది. ఆగస్టు నెలలో ప్రభుత్వానికి రూ.9,000 కోట్ల రూపాయల పన్నుఆదాయం వచ్చింది.
Tax Revenue: మొదటి ఐదు నెలల్లో 35 శాతం పన్నుల రాబడి! - ఆర్థిక సంవత్సరం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుల రాబడి(Tax revenue for the current financial year)లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఐదు నెలల్లో 35 శాతం అంచనాలు అందుకొంది. ఈ మేరకు వివరాలను కాగ్‌కు అందించింది. ఐదు నెలల్లో పన్నేతర ఆదాయం ద్వారా రూ.2,089 కోట్లు రాగా... కేంద్రం నుంచి 4,183 కోట్ల రూపాయలు వచ్చినట్లు నివేదికలో వెల్లడించింది.
ఐదు నెలల్లో పన్నేతర ఆదాయం ద్వారా రూ.2,089 కోట్లు రాగా... కేంద్రం నుంచి 4,183 కోట్ల రూపాయలు వచ్చాయి. 20,941 కోట్ల రూపాయలను రుణాల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకొంది. మొత్తం అన్ని రకాలుగా 64,826 కోట్లు రాగా... అందులో 58,937 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. రెవెన్యూ వ్యయం 24,107 కోట్లు కాగా, వేతనాలకు 11,310 కోట్లు ఖర్చు చేసింది. వడ్డీ చెల్లింపులకు 6,775 కోట్లు, పెన్షన్లకు 5,351 కోట్లు, రాయతీకి 4,421 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 6,971 కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యయం అయింది.
ఇదీ చూడండి:Revenue: గతేడాది కంటే పెరిగిన రాష్ట్ర రెవెన్యూ ఆదాయం