రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు, 2 మరణాలు - Corona news telangana
09:33 January 08
రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు నమోదయ్యయి. తాజాగా రెండు మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 2,89,135 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో ఇప్పటివరకు 1,561 మంది మృతిచెందారు. కరోనా నుంచి మరో 397 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా నుంచి 2,82,574 మంది బాధితులు కోలుకుని ఇంటికి వెళ్లారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5,000 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,798 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 66 కరోనా కేసులు వెలుగుచూశాయి.