తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలన్నీ పాటిస్తే.. హ్యాపీ స్టిక్కర్.. - రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్

31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల గోడ పత్రికను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ విడుదల చేశారు.

mahesh bhagavath
నిబంధనలన్నీ పాటిస్తే.. హ్యాపీ స్టిక్కర్..

By

Published : Jan 28, 2020, 10:55 AM IST

మేడ్చల్ జిల్లా నేరెడ్​​మేట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్​ కార్యాలయంలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సాల గోడ పత్రికను కమిషనర్ మహేశ్​ భగవత్​ సోమవారం విడుదల చేశారు. ప్రజలకు ట్రాఫిక్​పై అవగాహన కల్పించి... ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతి వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులుగా మారవద్దని యువతకు సూచించారు.

స్కూళ్లకు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. నిభందనలు పాటించని వాహనదారులకు గాంధీ గిరి పద్ధతిలో గులాబీలు అందజేస్తామని, అలాగే అన్ని నిబంధనలు పాటించిన వాహనదారులకు హ్యాపీ స్టిక్కర్​ను అందజేస్తామని మహేష్ భగవత్ తెలిపారు.

నిబంధనలన్నీ పాటిస్తే.. హ్యాపీ స్టిక్కర్..

ఇవీ చూడండి: మహారాష్ట్రలో మరో 'నిర్భయ' తరహా దారుణం

ABOUT THE AUTHOR

...view details