తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా అలర్ట్: రాష్ట్రంలో కొత్తగా మరో 3187 కొవిడ్ కేసులు - కొవిడ్​ కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 3,187 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 20,184కు చేరింది.

CORONA
కరోనా కేసులు

By

Published : Apr 11, 2021, 9:46 AM IST

Updated : Apr 11, 2021, 10:24 AM IST

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 3,187మందికి వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతేడాది మార్చ్ 2న రాష్ట్రంలో వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి నేటి వరకు భారీ మొత్తంలో కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. 2020 ఆగస్టు 25న రాష్ట్రంలో 3018 కేసులు నమోదయ్యాయి.

అంతకు మించి కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తున్న విషయం. తాజాగా వచ్చిన పాజిటివ్ కేసులతో కలిపి 3,27,278 మంది రాష్ట్రంలో వైరస్ బారిన పడ్డారు. మరో 787మంది మహమ్మారి నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 3,05,335 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా 7 కొవిడ్​తో మృతి చెందగా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,759కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 20,184 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 13,366 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక అత్యధికంగా జీహెచ్​ఎంసీలో 551 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరిలో 333, రంగారెడ్డి 271, జగిత్యాల 134, కామారెడ్డి 113, కరీంనగర్ 104, నిర్మల్ 154, సంగారెడ్డి జిల్లాలో 104 కేసులొచ్చాయి.

Last Updated : Apr 11, 2021, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details