ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో ప్రమాదానికి గురైన పడవలో రాష్ట్రానికి చెందిన మొత్తం 36 మంది పర్యాటకులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన 22 మంది పర్యటక బృందం బోటులో ఉన్నారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట మండలం కడిపికొండ ప్రాంతానికి చెందిన గొర్రె ప్రభాకర్ సహా 14 మంది కూడా బోటులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో వరంగల్ వాసులు గొర్రె ప్రభాకర్, కొమ్మల రవి, సిద్ది వెంకట స్వామి, బాస్కె దశరథములు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే బోటులో ఒకేసారి ఎక్కువ మంది ఎక్కడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. గోదావరిలో పాపి కొండల విహారానికి 72 మందితో వెళ్లిన పర్యటక బోటు ప్రమాదానికి గురైంది.
ప్రమాదానికి గురైన బోటులో 36 మంది రాష్ట్రవాసులు - warangal residents in godavari boat accidents
తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదానికి గురైన బోటులో రాష్ట్రానికి చెందిన 36 మంది ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన 22 మంది, వరంగల్‌కు చెందిన గొర్రె ప్రభాకర్ సహా 14 మంది బృందం కూడా బోటులో ఉన్నారు. అయితే గొర్రె ప్రభాకర్‌తో పాటు మరో 5 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

రాష్ట్ర వాసులు