రాష్ట్రంలో మరో 3,043 కరోనా కేసులు, 21 మరణాలు
20:36 May 24
రాష్ట్రంలో మరో 3,043 కరోనా కేసులు, 21 మరణాలు
రాష్ట్రంలో మరో 3,043 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్‌తో 21 మంది మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 4,693 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 39,206 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ 42,526 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 343 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 174, మేడ్చల్ జిల్లాలో 146 కొత్త కేసులు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో 165, ఖమ్మం జిల్లాలో 123, హబూబ్‌నగర్ జిల్లాలో 134 కరోనా కేసులు నమోదు నమోదయ్యాయి.