ఏపీలో కరోనా వైరస్‌తో మరో వ్యక్తి మృతి చెందారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య నాలుగుకు పెరిగిందని తెలిపింది. కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటించింది. మరోవైపు కేసుల సంఖ్య 304కు పెరిగినట్లు హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 33కు చేరినట్లు ప్రకటించింది.
జిల్లాల్లో కేసుల వివరాలు
ఏపీలో కరోనాతో మరొకరు మృతి.. 304కు చేరిన కేసులు - ఏపీ కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్‌తో మరో వ్యక్తి మృతి చెందాడని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య నాలుగుకు పెరిగిందని తెలిపింది.
కరోనా నుంచి కోలుకున్న ఆరుగురుని డిశ్చార్జి చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు 74 నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 42, కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 27, ప్రకాశం జిల్లా 24 , పశ్చిమ గోదావరి జిల్లా 21, విశాఖ జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బులెటిన్‌లో పేర్కొంది. ఏపీలో ఇప్పటివరకు 3677 నమూనాలు పరీక్ష చేస్తే 3270 కేసులు నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యాయని.. మరో 104 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చూడండి :'ఎంపీ ల్యాడ్స్ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'