తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్​లో భారీ చోరీ..రూ. 30లక్షలు అపహరణ - సికింద్రాబాద్ నగరంలోని మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ దొంగతనం జరిగింది

సికింద్రాబాద్​​ మహంకాళీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ బంగారం దుకాణం నుంచి పక్కనే ఉన్న మరో దుకాణానికి నగదు తీసుకెళ్తున్న వ్యక్తి కళ్లలో స్ప్రే కొట్టి బ్యాగ్​తో దండగులు ఉడాయించారు.

స్ప్రే చల్లి.. 30 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

By

Published : Nov 13, 2019, 5:58 AM IST

Updated : Nov 13, 2019, 11:19 AM IST

సికింద్రాబాద్​లోని మహంకాళీ పోలీస్​స్టేషన్​ పరిధిలో రూ.30 లక్షల చోరీ జరిగింది. బంగారం దుకాణం నుంచి మరో షోరూంకు నగదు తీసుకెళ్తున్న వ్యక్తి కళ్లలో స్ప్రే కొట్టి డబ్బు అపహరించుకుపోయారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు.

శ్రీనివాస వర్మ అనే వ్యక్తి జనరల్ బజార్లో రోహిత్ జ్యూవెలర్స్ పేరుతో బంగారం ఆభరణాలు తయారుచేసి ఆర్డర్లపై ఇతర షోరూంలకు అందిస్తుంటారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తన దుకాణానకి ఎదురుగా ఉండే బంగారం షోరూం నుంచి రూ.30 లక్షల నగదు తీసుకురమ్మని రూపరాం అనే వ్యక్తిని పంపించాడు. మొదటి అంతస్తు మెట్లు దిగుతుండగా మధ్యలోనే రూపరాంను అడ్డగించిన దుండగుడు కళ్లలో పెప్పర్​ స్ప్రేకొట్టి నగదు సంచి లాక్కొని పరారయ్యాడు. బాధితుడు తెరుకునేలోపే ద్విచక్రవాహనంపై అక్కడ నుంచి ఉడాయించాడు.

సికింద్రాబాద్​లో భారీ చోరీ..రూ. 30లక్షలు అపహరణ

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

Last Updated : Nov 13, 2019, 11:19 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details