తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి - పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం కాలువలోకి కారు దూసుకెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాహనం నుంచి బయటకిరాలేక అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పోలీసులు కారుతోపాటు మృతదేహాలను వెలికితీశారు.

3-people-died-in-an-accident-takes-place-in-west-godavari
3-people-died-in-an-accident-takes-place-in-west-godavari

By

Published : Mar 4, 2020, 8:09 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద నరసాపురం కాలువలోకి కారు దూసుకెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాహనం నుంచి బయటకిరాలేక అక్కడక్కడే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పోలీసులు కారుతోపాటు అందులోని మృతదేహాలను వెలికితీశారు. మృతులు యలమంచలి మండలం కాజా గ్రామ వాసులుగా గుర్తించారు. వారు కాజా నుంచి కాకినాడకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోంది. నిద్రమత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి

ఇదీ చదవండి: 'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'

ABOUT THE AUTHOR

...view details