తెలంగాణ

telangana

ETV Bharat / state

Domalguda Cylinder Blast Update : దోమలగూడ సిలిండర్ పేలుడు ఘటన.. 4కు చేరిన మృతుల సంఖ్య

Domalguda Gas Cylinder Blast Update
Domalguda Gas Cylinder Blast Update

By

Published : Jul 14, 2023, 11:51 AM IST

Updated : Jul 14, 2023, 12:46 PM IST

11:47 July 14

Domalguda Gas Cylinder Blast Death Toll : దోమలగూడ సిలిండర్ పేలుడు ఘటనలో 4కు చేరిన మృతుల సంఖ్య

Death Toll in Domalguda Gas Cylinder Blast : హైదరాబాద్ దోమలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఈరోజు మరో ముగ్గురు మృతి చెందారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి పద్మ, ఆమె కుమార్తె ధనలక్ష్మి, ధనలక్ష్మి కుమారుడు అభి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. బోనాల పండుగ నేపథ్యంలో ఈ నెల 10న ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా.. గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. బాధితులందరినీ స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శరణ్య అనే చిన్నారి అదే రోజు కన్నుమూసింది. మిగతా వారికి చికిత్స అందిస్తుండగా.. నేడు మరో ముగ్గురు ప్రాణాలొదిలారు. 5 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన మొత్తం నలుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల రోదనను ఆపడం ఎవరి తరమూ కావడం లేదు.

ఇదీ జరిగింది..: హైదరాబాద్​లో బోనాల పండుగ నేపథ్యంలో ఈ నెల 10న దోమలగూడలోని ఓ ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Cylinder Blast at Hyderabad : బోనాల పండుగ నేపథ్యంలో దోమలగూడ ప్రాంతానికి చెందిన నాగ లక్ష్మి అనే మహిళ ఇంటికి ఆమె కుమార్తె ధన లక్ష్మి, ఆమె పిల్లలు అభినవ్‌, శరణ్య, విహార్‌, నాగ లక్ష్మి సోదరి నాగులు, ఆమె భర్త ఆనంద్‌ వచ్చారు. వీరంతా కలిసి ఇంట్లో పిండివంటలు తయారు చేస్తుండగా.. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ నుంచి గ్యాస్‌ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురికీ మంటలు అంటుకున్నాయి. గది చిన్నదిగా ఉండటంతో బాధితులు బయటకు రాలేకపోయారు. క్షతగాత్రుల కేకలు విన్న స్థానికులు వారి ఇంటి వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించడంతో ఏడుగురికీ తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. అనంతరం స్థానికులు, పోలీసుల సహాయంతో గాయపడిన ఏడుగురిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శరణ్య అనే చిన్నారి అదే రోజు మృతి చెందగా.. మిగిలిన ఆరుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు మరో నాగలక్ష్మి, ధనలక్ష్మి, అభినవ్ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది.

ఇవీ చూడండి..:

Gas Cylinder Blast Hyderabad : గ్యాస్​ సిలిండర్​ పేలి ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం

Fire accident Secunderabad : సికింద్రాబాద్‌ లాడ్జిలో అగ్నిప్రమాదం

Last Updated : Jul 14, 2023, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details