తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ కేసు.. రెండో రోజు కొనసాగుతోన్న సిట్ విచారణ

TSPSC Paper Leakage Case Updates : టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌లను రెండోసారి రెండోరోజు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.

By

Published : Mar 27, 2023, 2:03 PM IST

2nd day sit investigation in tspsc group1 paper leakage case
టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. రెండో రోజు విచారణ

TSPSC Paper Leakage Case Updates : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌లను రెండోసారి రెండోరోజు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం నిన్న సిట్ కార్యాలయంలో విచారించిన అధికారులు.. నేడు మరికొందరిని విచారిస్తున్నారు. ఇదే కేసులో ఏ3 నిందితురాలుగా ఉన్న రేణుక సొంత మండలానికి చెందిన తిరుపతయ్యను అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. మరికొందరు అనుమానితులను సైతం సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

100కి పైగా మార్కులొచ్చిన వారి వివరాల సేకరణ..:లీకేజీ కేసు విచారణలో భాగంగా డాక్యా నాయక్​, రాజేశ్వర్​లను హైదరాబాద్​లో బస చేసిన హోటల్​కు తీసుకెళ్లి సిట్​ అధికారులు మరిన్ని వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కలు సాధించిన కొంత మంది అభ్యర్థుల వివరాలను సేకరించి వారిని సిట్‌ అధికారులు నిన్న విచారించారు. వంద మార్కులు సాధించిన వేర్వేరు జిల్లాలకు చెందిన 20 మంది యువతీ, యువకుల వ్యక్తిగత వివరాలను సిట్ అధికారులు సేకరించారు. వారిని కూడా హిమాయత్ నగర్​లోని సిట్ కార్యాలయంలో రెండో రోజు విచారణ జరపుతున్నారు. ఈ కేసులో వీరే కాక మరికొంతమందిని కూడా సిట్ అధికారులు విచారణ జరుపునున్నట్లు తెలుస్తోంది.

మరో ముగ్గురికై..:గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసులో నలుగురు వ్యక్తులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి ఇవ్వడానికి అనుమతించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ 1 ప్రవీణ్​తో పాటు రాజశేఖర్ ఏ 2, రేణుక ఏ 3, డాక్యా నాయక్‌ ఏ 4, కేతావత్‌ రాజేశ్వర్‌ ఏ5లను కోర్టు కస్టడీకి అప్పగించింది. పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మరో ముగ్గురు నిందితులైన షమీమ్‌ ఏ10, సురేశ్ ఏ11, రమేశ్ ఏ12 లను కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేయడానకి న్యాయస్థానం నేటికి వాయిదా వేసింది. పేపర్ లీకేజీ విషయంలో ముగ్గురు నిందితులను 6 రోజుల పాటు విచారించడానికి కస్టడీకి అనుమతినివ్వాలని సిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్​పై విచారణ జరిపి న్యాయస్థానం నేడు తీర్పు ఇవ్వనుంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details