సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు రెండో రోజూ విధులకు హాజరయ్యేందుకు డిపోలకు తరలివస్తున్నారు. జేబీఎస్లోని కంటోన్మెంట్ పికెట్ డిపో వద్ద విధులకు హాజరయ్యేందుకు వచ్చిన 11 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పట్ల దయ చూపి తమను విధులకు అనుమతించాలని కోరారు.