కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 2-డీజీ ఔషధాన్ని దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో కలిసి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. నేటి నుంచి 2-డీయాక్సి-డీ గ్లూకోజ్ ఔషధం అందుబాటులోకి రానుంది. కొవిడ్ చికిత్స కోసం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి ఈ ఔషధాన్ని డీఆర్డీవో అభివృద్ధి చేసింది.
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 2-డీజీ ఔషధం విడుదల - తెలంగాణ వార్తలు
డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధాన్ని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు. నేటి నుంచి ఈ ఔషధం అందుబాటులోకి రానుంది. కొవిడ్ చికిత్సలో 2డీజీ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
2డీజీ డ్రగ్ విడుదల, డీఆర్డీవో డ్రగ్ విడుదల
కొవిడ్ చికిత్సలో 2డీజీ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో 2డీజీ ఔషధం తయారు చేశారు. ఈ డ్రగ్‌తో ఆక్సిజన్‌పై చికిత్స పొందే సమయం తగ్గించొచ్చని డీఆర్డీవో తెలిపింది.
ఇదీ చదవండి:కొవిడ్ చికిత్సలో కొత్త మందు