2BHK Flats Lucky Draw in Hyderabad Today :జీహెచ్ఎంసీ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కలెక్టరేట్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపిక ప్రక్రియ(2BHK Flats Lottery) జరగనుంది. ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో మంత్రులు, ఉన్నతాధికారులు, లబ్దిదారుల సమక్షంలో ఆన్‌లైన్ డ్రా తీయనున్నారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. రెండో విడతలో ప్రభుత్వం 13,300 ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
Double Bedroom Flats Second Phase Lucky Draw :రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎంతో పారదర్శకంగా ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్(Special Software) ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్‌లైన్ డ్రా(Online Draw) తీయనున్నారు.
Double Bedroom Flats Second Phase Lucky Draw in Hyderabad :ఈ డ్రా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎంపీలు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, మూడు జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. గత నెల 24వ తేదీన జీహెచ్ఎంసీలో మొదటి విడతలో 11,700 మంది లబ్దిదారులను ఇదే పద్ధతిలో ఎంపిక చేసి.. ఈ నెల 2వ తేదీన 8 ప్రాంతాలలో ఇళ్లను అందించారు. ఇవాళ నిర్వహించే ఆన్‌లైన్ డ్రాలో ఎంపికైన లబ్దిదారులకు 21న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Municipal Administration Minister KTR) ఇళ్లను అందించనున్నారు.