2BHK Distribution in GHMC Today : గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లను ఒకేసారి భారీగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శనివారం రోజున (సెప్టెంబర్ 2) డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో.. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9 ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పీ.మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులు ఆయా నియోజకవర్గంలో ఎంపిక చేసిన 11,700 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు.
ఏయే ప్రాంతాల్లో 'డబుల్' ఇళ్లను లబ్ధిదారులకు ఎవరు అందజేస్తారంటే..?
Double Bed Room Houses Distribution in GHMC :కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో గాజుల రామారం, బహదూర్ పల్లి, డి-పోచంపల్లిలో మొత్తం 1,700 గృహాలనుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గాజులరామారంలో నిర్మించిన 144 ఇళ్లను.. బహదూర్‌పల్లిలో నిర్మించిన 356 గృహాలను.., కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 500 మందికి పంపిణీ చేస్తారు. డి-పోచంపల్లిలో నిర్మించిన 1,200 గృహాలను.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 200 మంది లబ్దిదారులకు, సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, కూకట్ పల్లి నియోజకవర్గం కు చెందిన 500 మందికి మొత్తం 1700 మంది లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
2BHK Distribution in Hyderabad : మంఖాల్-1 లొకేషన్‌లో నిర్మించిన 2230 ఇళ్లను లబ్ధిదారులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) డబుల్ ఇళ్లను పంపిణీ చేస్తారు. మాంఖాల్-1 లో నిర్మించిన 500 గృహాలను మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు.. మాంఖాల్-2 లో నిర్మించిన 1,730 ఇళ్లను మలక్ పేట్, యాకత్ పుర, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోని లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.
2BHK Distribution in Medchal :చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ సర్వే నెం.82, 83/పి లొకేషన్లలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ రెండు పడక గదుల ఇళ్ల(2BHK Scheme Telangana)ను పంపిణీ చేస్తారు. బహదూర్‌పుర నియోజకవర్గం పరిధిలోని ఫారూక్ నగర్‌లో నిర్మించిన 770గృహాలను ఎంపిక చేసిన లబ్దిదారులకు మంత్రి మహమూద్ అలీ పంపిణీ చేయనున్నారు. బండ్లగూడలో నిర్మించిన 270 గృహాలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన వారికి.. ఫారూక్ నగర్ లో నిర్మించిన 500 ఇండ్లను బహదూర్ పుర నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.