హైదరాబాద్ శివారులోని ఎరుకల నాంచారమ్మ నగర్లో 288 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇక్కడ రెండు బ్లాకుల్లో తొమ్మిది అంతస్తులతో మొత్తం 288 ఇళ్లను నిర్మించినట్లు చెప్పారు. అదే ప్రదేశంలో నివసిస్తూ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భూమిని ప్రభుత్వానికి అప్పగించిన కుటుంబాలకు 154 ఇళ్లను కేటాయించగా.. మిగిలిన ఇళ్లకు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేస్తామన్నారు.
'భాగ్యనగరం శివారులో 288 డబుల్ బెడ్‌రూం ఇళ్లు పూర్తి' - మేయర్ బొంతు రామ్మోహన్
భాగ్యనగరం శివారు ఎరుకల నాంచారమ్మ నగర్లో 288 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. తొమ్మిది అంతస్తులతో మొత్తం 288 ఇళ్లను నిర్మించినట్లు చెప్పారు.
బ్లాక్-ఏ లో 216 ఇళ్లు, బ్లాక్-బి లో 72 ఇళ్లు.. మొత్తం నిర్మాణ వ్యయం 24 కోట్ల 91 లక్షల 20 వేల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడించారు. ప్రతి యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.40 లక్షలు భరిస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, హైదరాబాద్ మెట్రో వాటర్ సదుపాయం, విద్యుత్ సదుపాయం, లిఫ్ట్ సదుపాయం, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు ప్రతి డబల్ బెడ్‌రూంకు సెల్లార్ పార్కింగ్, వర్షపునీటి సంరక్షణ పిట్స్, గ్రీనరి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :ప్రతిధ్వని: నేతన్నకు కరోనా కష్టాలు