రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు, 10 మరణాలు - covid 19 latest news
08:48 September 03
రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు, 10 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2 వేల 817 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. కొత్తగా నమోదైన వాటితో కలిపి కరోనా కేసుల సంఖ్య లక్షా 33 వేల 406కి చేరింది. మృతుల సంఖ్య 856కు చేరింది.
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2,611 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్ష 13 మందికి చేరింది. కొత్తగా 59 వేల 711 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షల సంఖ్య 15 లక్షల 42 వేల 978కి చేరింది. జీహెచ్‌ఎంపీ పరిధిలో 452 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 216, కరీంనగర్‌లో 164, ఖమ్మంలో 157, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 129, నల్గొండ 157 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేల 537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 25 వేల 293 మంది కరోనా బాధితులు ఉన్నారు.