తెలంగాణ

telangana

ETV Bharat / state

చైనా మాంజా విక్రయం.. ఎల్బీనగర్‌ జోన్‌లో 28 కేసులు - Ban on plastic

Cases against China Manja sellers : 2017లోనే చైనా మాంజా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నిషేధం విధించినప్పటికే హైదరాబాద్‌ నగరంలో పలు దుకాణాల్లో యథేచ్ఛగా మాంజా అమ్మేస్తున్నారు. వీటి వలన ఇటీవలే ద్విచక్ర వాహనదారులు గాయాలపాలయ్యారు. వీటిపై స్పందించిన పోలీసులు వాటిని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

Cases against Manja sellers
Cases against Manja sellers

By

Published : Jan 15, 2023, 10:27 PM IST

Cases against China Manja sellers : నగరంలోని ఎల్బీనగర్ జోన్‌లో చైనా మాంజా విక్రయాలు నిర్వహిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇప్పటివరకూ జరిపిన సోదాల్లో 28 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. 650 చైనీస్ మాంజా బాబిన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల నిషేధిత చైనా మంజా వల్ల ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు గాయాలపాలయ్యారు. 2017లోనే చైనా మాంజా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నిషేధం విధించింది.

చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై ఐపీసీ 188, 336, 5&15 పర్యావరణ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. చైనా మాంజాతో ఎవరైనా గాయపడితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details