AP corona cases: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28,598 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 2,690 కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారినపడి మరో 9 మంది మృతి చెందారు. వైరస్ బారి నుంచి.. కొత్తగా 11,855 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,572 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తూర్పుగోదావరిలో 518 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. గుంటూరు - 354, కృష్ణా -352, ప.గో జిల్లాలో -298 కేసులు వచ్చాయి.
భారీగా తగ్గిన కేసులు..
Covid Cases in India: మరోవైపు భారత్లో కొవిడ్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జరిపిన 14,48,513 పరీక్షల్లో 1,07,474 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 865 మంది మరణించారు. 2,13,246 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.90 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.91 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం మరణాలు: 5,01,979
- యాక్టివ్ కేసులు:12,25,011
- మొత్తం కోలుకున్నవారు:4,04,61,148
దేశంలో కొత్తగా 45,10,770 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,46,26,697 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చూడండి :AP CM YS Jagan: 'కొవిడ్, ఆర్థిక పరిస్థితుల్లోనూ చేయగల్గినంత చేశాం'