ఏపీలో గడిచిన 24 గంటల్లో 91,677 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,665 కేసులు(ap corona cases) నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,22,843 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,002కి చేరింది.
ap Corona Cases: ఏపీలో కొత్తగా 2,665 కరోనా కేసులు.. 16 మరణాలు - ఏపీలో కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (ap corona cases) మృతుల సంఖ్య 13వేలు దాటింది. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 16 మంది బాధితులు కొవిడ్ బారినపడి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 13,002కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
ap Corona Cases
24 గంటల వ్యవధిలో 3,231 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,81,161కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:CORONA CASES: రాష్ట్రంలో 97.77 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు