ఏపీలో గడిచిన 24 గంటల్లో 81,763 పరీక్షలు నిర్వహించగా.. 2,567 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 19,26,988 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,042కు చేరింది.
AP Corona Cases: కొత్తగా 2,567 కరోనా కేసులు, 18 మరణాలు - ఏపీ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 2,567 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,26,988 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ap corona cases
24 గంటల వ్యవధిలో 3,034 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,87,236కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,31,30,708 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:దేశంలోని తొలి కరోనా రోగికి మరోసారి పాజిటివ్