రాష్ట్రంలో గత 24 గంటల్లో 52,244 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 255 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,63,282కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 255 కరోనా కేసులు.. ఒకరు మృతి - కరోనా
రాష్ట్రంలో కొత్తగా 255 కరోనా కేసులు నమోదు కాగా.. మహమ్మారితో మరొకరు మృతి చెందారు. వైరస్ బారి నుంచి మరో 329 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 5,148 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 255 కరోనా కేసులు
మహమ్మారి బారిన పడి ఇవాళ ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,903కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 329 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 70 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:Vaccination: తెలంగాణలో రెండు కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి