తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు - 179 corona cases filed in ghmc
19:29 June 13
తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ్టి కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో 179 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 4,737 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా సంగారెడ్డిలో 24, మేడ్చల్లో 14, రంగారెడ్డిలో 11 కేసులు వెలుగు చూశాయి. ఈరోజు వైరస్ బారిన పడి 8 మంది మృతిచెందగా... మొత్తం మృతుల సంఖ్య 182కు చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,352 మంది డిశ్చార్జయ్యారు. ఆస్పత్రిలో 2,203 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి: దేశంలో కరోనా తీవ్రతపై ప్రధాని మోదీ సమీక్ష