Investments by Godrej Agrovet Limited: తెలంగాణలో మరో సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వంటనూనెల ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం గోద్రెజ్ సంస్థ రాష్ట్రంలో 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు.
ఖమ్మం జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. 2025 - 26 వరకు ప్లాంటును పూర్తి స్థాయిలో నడపాలని భావిస్తున్న గోద్రెజ్ సంస్థ... గంటకు 30 టన్నుల ప్లాంటును ప్రతిపాదిస్తోంది. దాన్ని గంటకు 60 టన్నుల సామర్థ్యానికి కూడా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ పెడుతున్న పెద్ద పెట్టుబడి ఇదే కానుంది. గోద్రెజ్ సంస్థ పెట్టుబడిని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఆయిల్ పామ్ సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన శ్రద్ధ ఫలితాలను ఇస్తోందని అన్నారు.