రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా 2,478 మందికి వైరస్ సోకగా.. ఇప్పటివరకు కరోనా వచ్చిన వారి సంఖ్య 3,21,182కి చేరింది. 363 మంది కొలుకోగా ఇప్పటి వరకు వైరస్ నుంచి 3,06,964 మంది బయటపడ్డారు. కొత్తగా ఐదు మంది మృతి చెందగా... మరణాలు 1,746కి పెరిగాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 5,472 యక్టివ్ కేసులు ఉండగా..9,675 మంది హోం ఐసోలేషన్లో వున్నారు.
రాష్ట్రంలో మరో 2,478 కరోనా కేసులు.. 5 మరణాలు - Case of coronavirus in telangana
09:33 April 09
రాష్ట్రంలో మరో 2,478 కరోనా కేసులు.. 5 మరణాలు
తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ జిల్లాలో 72, కొత్తగూడెం జిల్లాలో 35, జీహెచ్ఎంసీ పరిధిలో 402, జగిత్యాల జిల్లాలో 105, జనగామ జిల్లాలో 23, భూపాలపల్లి జిల్లాలో 11, గద్వాల్ జిల్లాలో 9, కామారెడ్డి జిల్లాలో 98, కరీంనగర్ జిల్లాలో 87, ఖమ్మం జిల్లాలో 54, ఆసిఫాబాద్ జిల్లాలో 67, మహబూబ్ నగర్ జిల్లాలో 96, మహబూబాబాద్ జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 85, మెదక్ జిల్లాలో 33, మల్కాజ్ గిరి జిల్లాలో 208, ములుగు జిల్లాలో 4, నాగర్ కర్నూల్ జిల్లాలో 43, నల్గొండ జిల్లాలో 88, నారాయణపేట జిల్లాలో 16, నిర్మల్ జిల్లాలో 111, నిజామాబాద్ జిల్లాలో 176, పెద్దపల్లి జిల్లాలో 33, సిరిసిల్ల జిల్లాలో 61, రంగారెడ్డి జిల్లాలో 162, సంగారెడ్డి జిల్లాలో 79, సిద్దిపేట జిల్లాలో 54, సూర్యాపేట జిల్లాలో 39, వికారాబాద్ జిల్లాలో 55, వనపర్తి జిల్లాలో 33, వరంగల్ రూరల్ జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 82, భువనగిరి జిల్లాలో 27 చొప్పున కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.
సరిహద్దు జిల్లాల్లో ఆందోళన
మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో నిత్యం 100 నుంచి 150 వరకు కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం సరిహద్దుల్లో కరోనా పరీక్షలు చేపడుతున్నామని చెబుతున్నా పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ...కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదీ చూడండి :తగ్గిపోతున్న టీకా డోసుల నిల్వలు..