ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,477 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,33,208కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి చెందగా.. ఏపీ వ్యాప్తంగా ఈ సంఖ్య 6,744 గా ఉంది. కొవిడ్ బారిన పడి మరో 2,701 మంది కోలుకోగా.. మొత్తం బాధితుల సంఖ్య 8.05 లక్షల మందిగా నమోదైంది.
ఏపీలో కొత్తగా 2,477 కరోనా కేసులు.. 10 మరణాలు - total corona cases in ap
ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 75 వేల 465 నమూనాల ఫలితాలు రాగా 2వేల 477 మంది కరోనా బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 33 వేల 208కి చేరినట్లు తెలిపింది. వైరస్‌తో మరో 10 మంది మృత్యువాతపడగా.. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 6 వేల 744కు పెరిగింది.
ఏపీలో కొత్తగా 2,477 కరోనా కేసులు.. 10 మరణాలు
ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 21,438 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో ఇప్పటివరకు 83.42 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్ లో పేర్కొంది.