తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయవాడ డివిజన్​లో 24 రైళ్ల రద్దు.. 8 దారి మళ్లింపు - trains canceled news

ఏపీ​లో ఈ నెల 25 నుంచి జనవరి 8 వరకు విజయవాడ డివిజన్ పరిధిలోని మార్గంలో 24 రైళ్లను పూర్తిగా, 4 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 8 రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు.

trains
24 రైళ్ల రద్దు.. 8 దారి మళ్లింపు

By

Published : Dec 20, 2020, 12:49 PM IST

విజయవాడ డివిజన్‌ పరిధిలోని రాజమహేంద్రవరం యార్డు రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 25 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ప్రకటించారు. ఈ మార్గంలో 24 రైళ్లను పూర్తిగా, 4 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 8 రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు.

రద్దయిన వాటిలో కాకినాడ టౌన్‌-లింగంపల్లి-కాకినాడ టౌన్‌ (నం.02775/02776), శాలిమార్‌-సికింద్రాబాద్‌-శాలిమార్‌ (నం.02773/02774), విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం (నం.02717/02718), విశాఖపట్నం-కడప-విశాఖపట్నం (నం.07488/07487), కాకినాడపోర్టు-ముంబయి ఎల్‌టీటీ-కాకినాడపోర్టు (నం.07221/07222)తో పాటు మరికొన్ని రైళ్లు ఉన్నాయి.

ఇదీ చదవండి:పులి మనిషిని చంపితే రూ.15 లక్షలివ్వాలి: అటవీ శాఖ

ABOUT THE AUTHOR

...view details