హైదరాబాద్‌లో వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓ ద్విచక్ర వాహనదారుడిని ఆపి సోదాలు జరిపారు. ఏకంగా 24 చలానాలు వాహనంపై ఉండడంతో వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 24 పెండింగ్ చలానాలు - 24 pending challans
ఓ వాహనంపై ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 24 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక చేసేది ఏమి లేక ఆ వాహన యజమాని చలానాలు అన్ని కట్టి.. వాహనాన్ని తీసుకెళ్లాడు.
ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో... ద్విచక్ర వాహన యజమాని మహ్మద్ రజాక్ అటువైపుగా వెళ్తున్నాడు. పోలీసులు అతన్ని నిలిపి వాహన నంబర్ ఆధారంగా పరిశీలించగా ఆ వాహనంపై ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 24 జరిమానాలు విధించినట్టు తేలింది. అవి ఇప్పటి వరకు కట్టలేదని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు అతని వాహనం స్వాధీనం చేసుకున్నారు. జరిమానాలు చెల్లించి వాహనం తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో రజాక్ జరిమానాల మొత్తం చెల్లించి తన వాహనాన్ని తీసుకువెళ్లాడు.
ఇదీ చూడండి: ట్రాఫిక్ చలానాలు 47.. చెల్లించాల్సింది రూ. 28 వేలు