తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి యథావిధిగా 24 గంటల విద్యుత్ సరఫరా - Telangana power supply news

24 Hours Power Supply: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ యథావిధిగా సరఫరాకానుంది. ఈ మేరకు కరెంట్ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.

Power Supply
Power Supply

By

Published : Apr 16, 2022, 7:18 AM IST

24 Hours Power Supply: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును శుక్రవారం నుంచి యథావిధిగా సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. రెండురోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాలతో వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కరెంటు సరఫరాకు ఆటంకాలు ఉండబోవని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బుధ, గురువారాల్లో తెలంగాణలో రాత్రిపూట సింగిల్‌ ఫేజ్‌ కరెంట్‌ మాత్రమే సరఫరా చేయడంతో కొన్నిచోట్ల రైతులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. దీనిపై సీఎండీ వివరణ ఇస్తూ.. ఇకపై 24 గంటలూ త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా ఉంటుందని ప్రకటించారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details