రాష్ట్రంలో కొత్తగా 238 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,87,740 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 1,551 మంది మృతిచెందారు. మహమ్మారి నుంచి మరో 518 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 2,81,083 మంది బాధితులు కోలుకుని ఇంటికి వెళ్లారు.
రాష్ట్రంలో కొత్తగా 238 కరోనా కేసులు, 2 మరణాలు - Telangana news
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కొత్తగా 238 కేసులు వెలుగుచూశాయి. తాజాగా ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,106 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 238 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 5,106 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,942 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 60 కరోనా కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చదవండి: కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందిస్తాం: భారత్ బయోటెక్