పాడి పరిశ్రమ సమాఖ్యలో 23మందికి పదోన్నతులు - డెయిరీని
రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్యలో 23మంది అధికారులకు పదోన్నతులు లభించాయి.
రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్యలో 23మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. మేనేజర్ గ్రేడ్ -1గా ప్రొడక్షన్ శాఖలో ఆరుగురికి, అసిస్టెంట్ డెయిరీ ఇంజినీర్లుగా నలుగురికి, రిజినల్ సెల్స్ మేనేజర్ గ్రేడ్ -1గా నలుగురికి పదోన్నతులు వరించాయి. అకౌంట్ ఆఫీసర్లుగా నలుగురికి, పర్సనల్ ఆఫీసర్‌గా ఒకరికి, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్‌లుగా ఇద్దరికి అసిస్టెంట్ మేనేజర్‌గా ఒకరు, మేనేజర్ గ్రేడ్ -2 ఒకరికి మొత్తంగా 23మందికి అధికారులకు సమాఖ్య ఛైర్మన్ మేనేజింగ్ డెరెక్టర్ లోకా భూమారెడ్డి పదోన్నతి పత్రాలు అందజేశారు. అధికారులందరూ డెయిరీని తన సొంత డెయిరీగా భావించి పనిచేస్తూ అభివృద్ధి చేయాలని కోరారు.