రాష్ట్రంలో కొత్తగా 2,273 మందికి కరోనా పాజిటివ్
08:18 September 16
రాష్ట్రంలో కొత్తగా 2,273 మందికి కరోనా పాజిటివ్
రాష్ట్రంలో కొత్తగా 2,273 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,62,844కు చేరింది. కొవిడ్‌తో మరో 12 మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 996కు పెరిగింది. వైరస్ నుంచి కోలుకుని మరో 2,260 మంది డిశ్చార్జయ్యారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,31,447కు చేరింది. ప్రస్తుతం 30,401 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో 23,569 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 325 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి :అమ్మకు తోడుగా వ్యాపారం.. భవిష్యత్ దిశగా చదువు..