రాష్ట్రంలో విజృంభిస్తున్న వైరస్... మరో ఆరుగురు మృతి - తెలంగాణ వార్తలు
09:19 April 12
రాష్ట్రంలో మరో 2,251 కరోనా కేసులు.. 6 మరణాలు
రాష్ట్రంలో వైరస్ కోరలు చాస్తుంది. రోజురోజుకు కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 2,251 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి మరో ఆరుగురు మృతి చెందారు. కొవిడ్ నుంచి మరో 565 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీల కేసులు 21 వేలు దాటాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 21,864 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 14,431 మంది బాధితులు కోలుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 355 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 79,027 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి:మాస్కు ధరిస్తే 14వేల మంది ప్రాణాలు సేఫ్!