రాష్ట్రంలో కొత్తగా 220 కొవిడ్ కేసులు నమోదయ్యాయి (TS Corona cases). వీటితో కలుపుకొని మొత్తం బాధితుల సంఖ్య 6,65,504కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయడంతో ఇప్పటి వరకూ 3,915 మంది మృతిచెందారు. కరోనా బారిన పడడంతో చికిత్స పొంది తాజాగా 255 మంది ఆరోగ్యవంతులు కాగా మొత్తంగా 6,57,040 మంది కోలుకున్నారు.
TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి - గత 24 గంటల్లో నమోదైన కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు (TS Corona cases)నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి మరో 255 మంది బాధితులు కోలుకున్నారు.
![TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి covid cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13204384-178-13204384-1632878974547.jpg)
రాష్ట్రవ్యాప్తంగా 44,200 నమూనాలను పరీక్షించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,62,80,662కు చేరింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 80 కేసులు నమోదు కాగా కరీంనగర్‌లో 21, ఖమ్మంలో 13, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ జిల్లాల్లో 12 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 3,33,107 కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తంగా 2,50,32,757 డోసులు పూర్తయ్యాయి. ఇందులో 1,81,95,430 మంది తొలి డోసును, 68,37,327 మంది రెండు డోసులను స్వీకరించారు.
ఇదీ చూడండి:కేరళలో 11వేల కరోనా కేసులు- ఆంక్షలు పొడిగింపు